స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడి పేరుతో రూ.29 లక్షలు స్వాహా

85చూసినవారు
స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడి పేరుతో రూ.29 లక్షలు స్వాహా
సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో ప్రజల్ని దోచుకుంటున్నారు. క్యూఆర్ కోడ్స్, లింకులతో జనాల సొమ్మును కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిని మోసం చేశారు కేటుగాళ్లు. వారు ఆమెతో పరిచయం పెంచుకొని ఓ యాప్‌ను ఆమె ఫోన్లో ఇన్‌స్టాల్ చేయించారు. అందులో ఆమె సుమారు 29.10 లక్షల నగదును డిపాజిట్ చేసింది. అనంతరం వారు స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లుగా గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్