ఓటీటీలోకి తమిళ్ హారర్ మూవీ.. ఎక్కడంటే?

54చూసినవారు
ఓటీటీలోకి తమిళ్ హారర్ మూవీ.. ఎక్కడంటే?
తమిళ డైరెక్టర్, నటుడు సుందర్.సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'బాక్'. తమిళ్‌లో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ అరణ్మనై నుంచి వచ్చిన 4వ చిత్రమిది. తమన్నా, రాశీఖన్నా క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం మే 3 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌‌లో త్వ‌ర‌లోనే మూవీ ఈ స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్