విడుదలకి ముందే రూ.40 కోట్లు దక్కించుకున్న 'తండేల్'

77చూసినవారు
విడుదలకి ముందే రూ.40 కోట్లు దక్కించుకున్న 'తండేల్'
చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న 'తండేల్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య కూడా ఈ పాన్ ఇండియా మూవీపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్న నేపథ్యంలో డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.40 కోట్లకు దక్కించుకుంది. నాగ చైతన్య కెరీర్లో గతంలో ఏ సినిమా డిజిటల్ హక్కులు ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోలేదు. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత పోస్ట్