బుడ్డోడి ఆన్సర్‌కు టీచర్ షాక్..! నవ్వులే నవ్వులు (Video)

1063చూసినవారు
టీచర్లు తిట్టడం, స్టూడెంట్లకు కోపాలు రావడం కామనే! కానీ కొన్ని సందర్భాల్లో విద్యార్థుల ఆగ్రహం చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది. ఇలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బుడ్డోడిని హోం వర్క్ సరిగా చేయలేదని టీచర్ కసురుకుంది. కాసేపు చిన్నోడు టీచర్ కేసి బిక్క మొహంతో చూసి గయ్యిమన్నాడు. ‘‘మా అమ్మ ఎవరికీ భయపడొద్దంది’’ అంటూ హీరో లెవెల్లో గర్జించాడు. పక్కనున్న ఇతర టీచర్లు ఇదంతా చూసి గొల్లున నవ్వారు.

సంబంధిత పోస్ట్