AP: తిరుపతి జిల్లా రాజుల కండ్రిగ పాఠశాల టీచర్ రత్నకుమార్ వరద ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. రత్నకుమార్ బైకుపై పాఠశాలకు బయలుదేరాడు. మార్గమధ్యలో గోవిందవరం సమీపంలో వరద ప్రవాహంలో బైక్ కొట్టుకుపోయింది. స్థానికులు గుర్తించి ఉపాధ్యాయుడిని కాపాడారు. తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది.