తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర మంత్రులు, బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీల అఖిలపక్ష బృందంతో కలిసి బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నాలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆమోదముద్ర వేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద ఒత్తిడి పెంచే పనిలో పడింది. బీసీ సంఘాల ధర్నాకి రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు.