వైద్యరంగంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 7,332 పోస్టులను భర్తీ చేయడంతోపాటు, వారి సమస్యలను సైతం పరిష్కరిస్తోంది. ఇంకా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే కొత్తగా 50 పీజీ సీట్లను మంజూరు చేసింది. ఈ క్రమంలో 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు.