రాష్ట్రానికి జల విద్యుత్ కోసం తెలంగాణ సర్కార్ హిమాచల్‌ప్రదేశ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు అధికారులు కలిసి శనివారం సిమ్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.." హిమాచల్ ప్రదేశ్‌తో జల విద్యుత్ ఒప్పందం గొప్ప ముందడుగు. విద్యుత్ వనరుల విస్తరణ, గ్రీన్ పవర్ సాధనలో ఈ ఒప్పందం కీలకమైనది. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి ఆర్థికంగా మేలు జరుగుతుంది." అని పేర్కొన్నారు.