తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ 2025-26 వార్షిక బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ప్రతిపాదనలు కోరింది. జనవరి 4 లోపు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.