తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించనుంది. అలాగే రైతు, కుల గణన సర్వేపై చర్చించే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఫలితాల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 7తో ప్రభుత్వానికి ఏడాది పూర్తి కావడంతో ఆ లోపే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.