TG: వర్షాలు.. దోమలతో జాగ్రత్త..!!

26553చూసినవారు
TG: వర్షాలు.. దోమలతో జాగ్రత్త..!!
తెలంగాణలో వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మలేరియా, డెంగీ, చికన్ గున్యా వంటి రోగాలు ప్రబలే ప్రమాదం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. 'ఇంటి డోర్లు, కిటికీలను మస్కిటో నెట్స్ తో క్లోజ్ చేయాలి. మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ పిల్లలకు దూరంగా ఉంచాలి. ప్రతి ఫ్రైడేను డ్రైడేగా పాటించి ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి' అని చెప్పింది.

సంబంధిత పోస్ట్