రెస్టారెంట్లలో ఆపరిశుభ్రత, పాడైపోయిన వంటకాలతో ప్రజలు నిత్యం అనారోగ్యం బారిన పడుతున్నారు. రాజధాని నగరం హైదరాబాదే కాదు ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. తాజాగా నిజామాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆర్కేడ్ రెస్టారెంట్ అండ్ బార్, లహరి హోటల్లో కుళ్లిపోయిన చికెన్ ను గుర్తించారు. దాన్ని ఫ్రిజ్లో స్టోర్ చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు తెలిపారు. అలాగే సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు పేర్కొన్నారు.