పిల్లలను కంటే రూ. 62 లక్షలు

65చూసినవారు
పిల్లలను కంటే రూ. 62 లక్షలు
దక్షిణ కొరియాలో పడిపోతున్న జనన రేటును పెంచేందుకు ఆ దేశ నిర్మాణ రంగ కంపెనీ బూయంగ్‌ ఉద్యోగులకు భారీ ఆఫర్‌ ప్రకటించింది. పిల్లల్ని కన్న ప్రతిసారి రూ.62.54 లక్షలు అంటే 100 మిలియన్ల కొరియన్‌ వాన్లు చెల్లిస్తామని తెలిపింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. జనవరి 2024లో దేశంలో రికార్డు స్థాయిలో తక్కువ సంఖ్యలో జననాలు జరిగాయి. కేవలం 21,442 మంది పిల్లలు మాత్రమే జన్మించారు.

సంబంధిత పోస్ట్