అందుకే విచారణకు హాజరు కాలేదు: నటి హేమ

548చూసినవారు
అందుకే విచారణకు హాజరు కాలేదు: నటి హేమ
బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా సోమవారం విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని, విచారణకు హాజరుకాలేనని నటి హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరుకావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోనట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్