సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు.. బోగస్ అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో వాటా 20 శాతానికి మించలేదని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు.