పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత ఆర్చర్లకు నిరాశే ఎదురైంది. కాంస్య పతక పోరులో బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్ జోడీ అమెరికాతో తలపడి 2-6 తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు సెమీస్‌లో భారత జంట సౌత్ కొరియాపై ఓడిన విషయం తెలిసిందే. దీంతో పతకం గెలిచే అవకాశాన్ని కోల్పోయింది.