డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు

67చూసినవారు
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్‌, రాజస్థాన్‌లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్‌ ల్యాబ్‌లను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఛేదించింది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, గుజరాత్‌ పోలీస్‌ ఏటీఎస్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టింది. రాజస్థాన్‌లోని జలోర్‌, భీన్‌మల్‌, జోధ్‌పుర్‌ జిల్లాల్లో మూడు తయారీ కేంద్రాల నుంచి దాదాపు 149 కిలోల ‘మ్యావ్‌ మ్యావ్‌’, 50 కిలోల ఎఫిడ్రిన్‌, 200 లీటర్ల అసిటోన్‌ను స్వాధీనం చేసుకుని, ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్