కూతురి గొంతు నొక్కి నదిలోకి తోసేసిన తండ్రి

270572చూసినవారు
కూతురి గొంతు నొక్కి నదిలోకి తోసేసిన తండ్రి
తన కూతురు ఒక అబ్బాయితో మాట్లాడటం చూసిన తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. బంధువులతో కలిసి కుమార్తె గొంతు నొక్కి నదిలోకి తోసేశాడు. ఆ యువతి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో జరిగింది. అలీగఢ్‌కు చెందిన 16 ఏళ్ల యువతి 9వ తరగతి చదువుతోంది. అబ్బాయితో ఆమె మాట్లాడటం తండ్రి చూసి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆమె తిరస్కరించడంతో నదిలో తోసేశాడు.

సంబంధిత పోస్ట్