ఢిల్లీ డంపింగ్​ యార్డ్​లో చల్లారని మంటలు

81చూసినవారు
ఢిల్లీలోని గాజీపుర్​లోని డంపింగ్ యార్డులో ఆదివారం సాయంత్రం సంభవించిన భారీ అగ్నిప్రమాదం స్థానికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు దాదాపు 10 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కాగా, పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా నల్లని పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. అయితే దట్టమైన పొగలు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్