రాయదుర్గం ఐటీ ఫీల్డ్‌లో పోకిరీల హల్‌చల్‌

64చూసినవారు
రాయదుర్గం ఐటీ ఫీల్డ్‌లో పోకిరీల హల్‌చల్‌
రాయదుర్గం టీహబ్ రోడ్లు, ఐటీ క్షేత్రంలోని రహదారులు అర్ధరాత్రి వేళల్లో బైకు రేసులకు, విన్యాసాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. పోలీసుల నిఘా అంతంత మాత్రంగా ఉండడంతో పోకిరీల జోరుకు అదుపులేదు. రాత్రి వేళ బైకర్లు గుంపులుగా చేరుకుని వాహనాలను మెరుపు వేగంతో నడిపించడమేకాక విన్యాసాలూ చేస్తుంటారు. పోలీసులు గస్తీని పటిష్ఠం చేసి, వేగ నిరోధకాలు ఏర్పాటు చేయనున్నారు. బైకర్లపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్