కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్ష నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు సీబీఐ వర్గాలు సోమవారం వెల్లడించాయి. మంగళవారం అతడికి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది.