కోల్‌కతా RG కర్ ఆసుపత్రిలోని ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్ గురించి ఆయన తల్లి ఆసక్తికర విషయాలు తెలిపింది. 'సంజయ్ చిన్నప్పటి నుంచి స్కూల్ టాపర్. చదువుతో పాటు స్పోర్ట్స్‌లో ముందుండే వాడు. నా కొడుకు ఇలా చేయడం వెనుక ఎవరున్నా, వారిని కూడా కఠినంగా శిక్షించాలి' అని పేర్కొంది. తన కుమారుడి పట్ల తాను తొలి నుంచి కఠినంగా ఉంటే ఇలా జరిగుండేది కాదని వాపోయింది.