తిరుపతిలో కొనసాగుతున్న గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

73చూసినవారు
తిరుపతిలో కొనసాగుతున్న గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గోవిందరాజస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహన సేవ కొనసాగింది. గురువారం రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 6.35 గంటల నుంచి స్వామివారు రథంపై, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్