ఇజ్రాయెల్‌ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి

84చూసినవారు
ఇజ్రాయెల్‌ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
గాజాలో హమాస్-ఇజ్రాయెల్ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌ను అంతం చేసే లక్ష్యంతో దాడులతో విరుచుకుపడింది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ.. ఐర్లాండ్ మరియు నార్వేలోని తమ రాయబారులను వారి స్వదేశాలకు తిరిగి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. పాలస్తీనియన్లకు ప్రత్యేక రాష్ట్ర హోదాను ఈ రెండు దేశాలు గుర్తించాలన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్