మనదేశంలో హనుమంతుడికి కోట్లాది మంది భక్తులుంటారు. కానీ ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామంలో మాత్రం హనుమంతుడి పేరు ఎత్తరు. ఈ ఊరిలో ఆంజనేయ స్వామి గుడి కూడా లేదు. ఈ ఊరు పేరు ‘ద్రోణగిరి’. ఈ ఊరికి రామయణానికి సంబంధం ఉంది. లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని ఎత్తుకెళ్లి సంజీవనిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ గ్రామం నుంచే సంజీవనిని తీసుకెళ్లారు. దాంతో ఆ గ్రామస్తులకు హనుమంతుడు అంటే ఆగ్రహం.