కేజీ రూ.75 వేల పైన పలుకుతున్న మిర్చి విత్తనాల ధర

58చూసినవారు
కేజీ రూ.75 వేల పైన పలుకుతున్న మిర్చి విత్తనాల ధర
వాణిజ్య పంటైన మిర్చిని ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, మంగపేట, కన్నయిగూడెం మండలాల్లోని రైతులు అత్యధికంగా పండిస్తూ ఉంటారు. మిర్చి విత్తనాలు బ్లాక్ చేయడంతో స్థానిక డీలర్ల దగ్గర మంచి విత్తనాలు లేకపోవడం, మంచి విత్తనాలు దొరకవనే భయంతో బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తూ అధిక భారం మోస్తున్నారు రైతులు. ఒక కేజీ 60 వేలకు అమ్మవలసిన మిర్చి విత్తనాలు 75 వేల నుండి లక్ష రూపాయల ధర పలుకుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్