తమ్ముడి ప్రాణాలు కాపాడిన అక్క.. ఏం చేసిందంటే!

64682చూసినవారు
తమ్ముడి ప్రాణాలు కాపాడిన అక్క.. ఏం చేసిందంటే!
ప్రాణాపాయంలో ఉన్న తమ్ముడిని అక్క రక్షించిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి(M) చెన్నూర్ గ్రామంలో జరిగింది. తమ్ముడు మనివర్ధన్(6) వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో అక్క మధుప్రియ(10) సమయస్ఫూర్తితో హీటర్ ప్లగ్ తీయడానికి ప్రయత్నించగా అది రాకపోయేసరికి కనెక్ట్ చేయబడిన వైర్ ని చేతి చుట్టూ చుట్టుకుని గట్టిగా లాగి అవతల పడవేసి తమ్ముడిని కాపాడింది. దీంతో మధుప్రియ ధైర్య సాహసాలను గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్