ప్రాణాలు పణంగా పెట్టి గర్భిణీని రక్షించిన జవాన్లు

4429చూసినవారు
ప్రాణాలు పణంగా పెట్టి గర్భిణీని రక్షించిన జవాన్లు
జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం భారీ మంచు కురుస్తున్నందున పలు రహదారులు మంచుతో నిండిపోయాయి. రోగులు కూడా ఆసుపత్రులకు చేరుకోలేకపోతున్నారు. దీంతో భారతీయ ఆర్మీ సిబ్బంది సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కుప్వాడలో మంచు కురుస్తున్న కారణంగా ఆసుపత్రి సహాయం నిరాకరించడంతో గర్భిణీ స్త్రీ కుటుంబం ఆర్మీ సిబ్బందిని సంప్రదించింది. గర్భిణిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి.. చీకటిలో ఆమె ఇంటికి 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్