తమిళనాడును ఫెంగల్ తుఫాన్ అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలోనే వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన తమిళనాడు మంత్రి తిరు పొన్ముడికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి రావడాన్ని గమనించిన వరద బాధితులు చేతుల్లో బురదతో స్వాగతం పలికారు. అంతేకాకుండా కొందరు ఆయనపై బురద చల్లారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత అన్నామలై ట్విట్టర్ వేదికగా పోస్టు చేయగా ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.