ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్షాకు జాతీయ అవార్డు వరించింది. దివ్యాంగుల చట్టం అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును రాష్ట్ర సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అందుకున్నారు.