ఫ్లైట్ నుంచి దించేస్తున్న విమాన సిబ్బందిని కొరికిన మహిళ

72చూసినవారు
ఫ్లైట్ నుంచి దించేస్తున్న విమాన సిబ్బందిని కొరికిన మహిళ
విమాన సిబ్బందిపై దాడిచేసి, ఆపై కొరికి గాయపరిచిన మహిళా ప్రయాణికురాలిపై లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. నిందితురాలైన మహిళ ముంబై వెళ్లేందుకు లక్నో విమానాశ్రయానికి చేరుకుంది. సాయంత్రం 5.25 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. విమానం ఎక్కిన మహిళ సహ ప్రయాణికురాలపై అరుస్తూ గొడవకు దిగింది. కాగా, విమానం నుంచి దిగుతున్న సమయంలో గ్రౌండ్ సిబ్బందిలో ఒకరిపై దాడిచేసిన మహిళ అతడి మణికట్టును కొరికేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్