సెల్‌ఫోన్‌ కోసం బావిలోకి దిగిన మహిళ.. చివరకు

55చూసినవారు
సెల్‌ఫోన్‌ కోసం బావిలోకి దిగిన మహిళ.. చివరకు
సెల్‌ఫోన్‌ కోసం బావిలోకి దిగిన మహిళ తీవ్ర గాయాలతో బయటపడింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం జరిగింది. బద్దిపోచమ్మ వీధిలో ఉంటున్న కూర రాజమణి సెల్‌ఫోన్‌ ఆదివారం చేదబావిలో పడిపోయింది. బావిలో నీళ్లు లేకపోవడంతో ఆమె తాడు సహాయంతో బావిలోకి దిగి ఫోన్‌ తీసుకుని పైకి వస్తుండగా తాడు తెగి బావిలో పడింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆమెను బయటకు తీశారు. రెండు కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్