నాలుక కోసుకుని దేవుడికి స‌మ‌ర్పించాడు..

62చూసినవారు
నాలుక కోసుకుని దేవుడికి స‌మ‌ర్పించాడు..
33 ఏళ్ల ఓ వ్య‌క్తి త‌న నాలుక‌ను కోసేసుని, దేవుడికి నైవేధ్యంగా స‌మ‌ర్పించాడు. ఈ ఘ‌ట‌న ఛత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జిల్లాలో ఇవాళ ఉద‌యం త‌నౌడ్ గ్రామం.. అంజోరా పీఎస్ ప‌రిధిలో జ‌రిగింది. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం.. రాజేశ్వ‌ర్ నిషాద్ అనే వ్య‌క్తి గ్రామంలోని చెరువు వ‌ద్ద‌కు వెళ్లి, కొన్ని మంత్రాలు వ‌ల్లించి, త‌న నాలుక‌ను క‌త్తితో తానే కోసుకున్నాడు. ఆ చెరువు వ‌ద్ద ఉన్న ఓ రాయిపై ఆ కోసిన నాలుక‌ను ఉంచాడు. నాలుక కోసుకోవ‌డానికి గ‌ల క‌చ్చిత‌మైన కార‌ణాలు ఇంకా తెలియ‌దు.

సంబంధిత పోస్ట్