బొప్పాయి గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

59చూసినవారు
బొప్పాయి గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
బొప్పాయి పండులోని విత్తనాలతో కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి గింజలు పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, టానిన్లు, సపోనిన్‌లకు మంచి మూలం. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి దెబ్బతినకుండా కాపాడతాయని పేర్కొన్నారు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే కార్పైన్ మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా మరియు పరాన్నజీవులను తొలగించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్