ఏపీ ఉద్యోగుల వేతన సవరణకు నియమించిన 12వ పీఆర్సీ ఛైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగులను కేటాయించకపోవడంతో ఆ పదవి నుంచి తప్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌కి మంగళవారం లేఖ రాశారు. దీంతో పాటు మరికొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా ఛైర్మన్ పదవి నుంచి తనను రిలీవ్ చేయాలని మన్మోహన్‌సింగ్ కోరారు.