కారం ఎక్కువగా తింటే కలిగే దుష్ఫలితాలివే

84చూసినవారు
కారం ఎక్కువగా తింటే కలిగే దుష్ఫలితాలివే
చాలా మంది వంటల్లో కారం ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కారం ఎక్కువగా తీసుకుంటే అసిడిటీ, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కూరల్లో కారం ఎక్కువయ్యేకొద్దీ గొంతు, కడుపులో మంట రావచ్చు. అజీర్తి సమస్యలు వస్తాయి. కారం ఎక్కువగా తినేవారిలో కడుపులో పుండ్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకూ కారం అధిక మోతాదును తగ్గించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్