స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆగస్టు 14న నాందేడ్-శ్రీకాకుళం రోడ్ (07487) మధ్య ప్రత్యేక రైలు నాందేడ్‌లో బుధవారం మధ్యాహ్నం 2గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకోనుంది. అలాగే ఆగస్టు 15న శ్రీకాకుళం రోడ్-నాందేడ్ (07488) ప్రత్యేక రైలు గురువారం సాయంత్రం 5గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.25గంటలకు నాందేడ్‌కు చేరుకోనుంది.