ఈ ఆహారాల్లో ప్రొటీన్ చాలా ఎక్కువ

82చూసినవారు
ఈ ఆహారాల్లో ప్రొటీన్ చాలా ఎక్కువ
నాన్‌వెజ్, గుడ్లు తినని వారు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి. కాటేజ్ చీజ్ అనేది ప్రోటీన్ పవర్‌హౌస్. దీని నుంచి ఎముకలకు అవసరమైన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఉండే సెలీనియం అనే ఖనిజం థైరాయిడ్ గ్లాండ్ పనితీరును మెరుగుపరుస్తుంది. శనగలు, కంది, పెసర, బఠానీ వంటి పప్పు ధాన్యాల్లో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్‌, ఐరన్‌, జింక్‌, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్