చలికాలం క్యారెట్ సాగుకు ఈ నేలలు అనుకూలం

66చూసినవారు
చలికాలం క్యారెట్ సాగుకు ఈ నేలలు అనుకూలం
క్యారెట్ సాగులో శీతాకాలపు పంట అధిక వేడిని తట్టుకోలేదు. 20-28 డిగ్రీల సెం.గ్రే. ఉష్ణోగ్రత వద్ద మంచి దిగుబడి వస్తుంది. తేమ అధికంగా నిలుపుకొనే నేలలు మంచివి. మురుగునీటి వసతి గల లోతైన సారవంతమైన గరపనేలలు సాగుకు అత్యంత అనుకూలం. నేల ఉదజని సూచిక 6 - 6.5 ఉండాలి. నల్ల మట్టి, బంకనేలలు సాగుకు అనుకూలం కాదు. నేలను నాలుగైదుసార్లు బాగా దున్ని పశువుల పెంటను నేలలో కలియబెట్టాలి. పంట నాటుకోవడానికి బోధలు, కాలువలుగా తయారు చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్