బతికుండగానే పూడ్చిపెట్టారు.. 4 రోజుల తర్వాత తవ్వి చూస్తే.. (Video)

4259చూసినవారు
ఈ నెల 13న మోల్డోవాలోని ఉస్టియా అనే గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోల్డోవాలో 74 ఏళ్ల మహిళ ఇంట్లోనే కిరాతకంగా హత్యకు గురైంది. మహిళ హత్య జరిగినప్పటి నుంచి భర్త ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఇంటి నేల కింద నుంచి వస్తున్న మూలుగులు, కేకలు విని, వెంటనే అక్కడ తవ్వకాలు చేపట్టారు. లోపలికి వెళ్లి చూడగా అక్కడ బతికున్న 62 ఏళ్ల వ్యక్తి వారికి కనిపించాడు. 18 ఏళ్ల యువకుడు తనని ఇలా పూడ్చేశాడని తెలిపాడు.

సంబంధిత పోస్ట్