విద్యాభ్యాసం కోసం భారత్ నుంచి తమ దేశానికి వచ్చిన వారిలో 20 వేల మంది ఆయా కళాశాలల్లో ప్రవేశాలు పొందలేదని కెనడా వలస, కాందిశీకుల, పౌరసత్వ సంస్థ (ఐఆర్‌సీసీ) వెల్లడించింది. మొత్తం 3.27 లక్షల మంది విద్యార్థుల్లో 19,582 మంది (5.4 శాతం) విద్యార్థులు సంబంధిత కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి తమ సమ్మతి తెలపలేదని వెల్లడించింది. మరో 12,553 మంది ప్రవేశాల సమాచారం విద్యాసంస్థల వద్ద లేదని చెప్పింది.