పంజాబ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జలంధర్‌లోని బైక్‌పై వెళ్తున్న ముగ్గురు దొంగలు.. కాలేజీకి వెళ్లి వస్తున్న ఇంటర్ విద్యార్థిని మొబైల్ ఫోన్‌ను కొట్టేశారు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని దొంగలను వదలకుండా గట్టిగా పట్టుకుంది. దీంతో బైక్ మీద ఉన్న దొంగలు ఆమె జుట్టు పట్టుకొని కింద పడేసి చాలా దూరం వరకు లాక్కెళ్లి వదిలేశారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.