బంగ్లాదేశ్‌లో అల్లర్లు మన పాలకులకు పాఠాలని కశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు. నియంతృత్వ పాలన ఎక్కడ కూడా ఎక్కువ కాలం పాటు కొనసాగదని పేర్కొన్నారు. ‘బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు ప్రస్తుతం కశ్మీర్‌లో కూడా ఉన్నాయి. యూఏపీఏ, పీఎస్ఏ లాంటి చట్టాలతో కశ్మీరీ యువత విసిగివేసారారు. బంగ్లాదేశ్ తరహా తిరుగుబాటు కశ్మీర్‌లో జరగకూడదని నేను కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.