మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయ సముదాయంలోని నాగచంద్రేశ్వర్ ఆలయంలో నాగ పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏడాదికి ఒకసారి శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజు మాత్రమే ఈ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. ఈ నాగచంద్రేశ్వరుని ఆలయంలో పాముపై కూర్చున్న శివ-పార్వతుల విగ్రహం చాలా అరుదైనది. ఈ విగ్రహాన్ని దర్శించి పూజించడం ద్వారా శివపార్వతులిద్దరూ సంతోషిస్తారని, పాముల భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.