ఈడీ సమన్లపై కేజ్రీవాల్ స్పందన ఇదే!

75చూసినవారు
ఈడీ సమన్లపై కేజ్రీవాల్ స్పందన ఇదే!
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు. దీనిపై గురువారం ఆయన బదులిచ్చారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఈడీ సమన్లు స్వీకరించడానికి నేను సిద్ధం. కానీ గతంలో ఇచ్చిన వాటిలాగే ఈ సమన్లు చట్ట విరుద్ధం. ఇవి రాజకీయంగా ప్రేరేపితమైనవి. వీటిని ఉపసంహరించుకోవాలి.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్