దానిపైనే ప్రధానిగా మోదీ తొలి సంతకం

69చూసినవారు
దానిపైనే ప్రధానిగా మోదీ తొలి సంతకం
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లోని పీఎంఓ కార్యాలయంలో మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో పీఎం కిసాన్‌ నిధి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్లు అకౌంట్లలో పడనున్నాయి. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలిపారు.

సంబంధిత పోస్ట్