షావోమీ తన మార్కెట్‌ను పెంచుకోవడానికి వాహన రంగంలో కూడా అడుగు పెట్టింది. ఈ క్రమంలో Xiaomi YU7 అనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ కారు ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో 75kWh బ్యాటరీ ఉంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జీ చేస్తే దాదాపు 800 కిలోమీటర్ల వెళ్లొచ్చు. అలాగే గరిష్టంగా గంటకు 265 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది త్వరలోనే భారత్ మార్కెట్లోకి విడుదల కానుంది