వైసీపీ ఓటమికి ఇదే కారణం: మాజీ మంత్రి

65చూసినవారు
వైసీపీ ఓటమికి ఇదే కారణం: మాజీ మంత్రి
ఏపీలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కూల్చివేతల వల్లనే ఇంతటి దారుణ ఓటమిని చవిచూశామని తెలిపారు. లేకపోతే ఈరోజు అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లమని తెలిపారు. కూల్చివేతలే లేకపోతే తామందరం ఈరోజు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేవారమని పేర్కొన్నారు. ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని వ్యవహరిస్తే మంచిదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్