మేడారంలో భక్తులు తొలి మొక్కు చెల్లించేది ఇక్కడే

63చూసినవారు
మేడారంలో భక్తులు తొలి మొక్కు చెల్లించేది ఇక్కడే
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు వచ్చే భక్తులు ముందుగా ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లి ఆలయం వద్ద ఆగి మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. అందుకే ఈ తల్లికి మొదటి మొక్కుల తల్లిగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 'గేట్ వే ఆఫ్ మేడారం'గా కూడా పిలుస్తుంటారు. కాకతీయ సైన్యంతో సమ్మక్క చేసిన పోరాటంలో ఆమెకు గట్టమ్మ తల్లి అంగరక్షకులుగా ఉన్నారని, సమ్మక్కకు గట్టమ్మ నమ్మకమైన బంటు అని చరిత్ర కథలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్