అందరి అనుమానాలు పటాపంచలు: చంద్రబాబు

85చూసినవారు
అందరి అనుమానాలు పటాపంచలు: చంద్రబాబు
టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ ధర్మవరంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఇవాళ మూడు పార్టీలు మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరిల్లిందన్నారు. నడి ఎండలో మీటింగ్ పెట్టినా జనం పోటెత్తారని, జనాన్ని చూసి ఎండలు భయపడుతున్నాయన్నారు. అమిత్ షా ఇచ్చిన క్లారిటీతో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయన్నారు. దేశంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమని, మోడీనే మరోసారి ప్రధాని కాబోతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్